ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు
అడుగడుగునా పోలీస్ క్యాంపులు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాయుధ బలగాలు
- అనేక దశాబ్దాల పాటు భారత దేశంలో దాదాపు సగం రాష్ట్రాల్లో తన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది
- మూడు రకాలైన ఇబ్బందులు నడుమ మావోయిస్టు ఉద్యమ భవితవ్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది
- ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు దండకారుణ్యంలో సమాంతర ప్రభుత్వాన్నినడిపిన మావోయిస్టులు ఇప్పుడు ఢీలా పడిపోతున్నారు
- ఒక పక్క ఎన్ కౌంటర్లు, మరో పక్క లొంగుబాట్లు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి
- పోలీస్ బలగాల ముప్పేట దాడితో రక్షణ కరువవుతుంది. మొదటిగా దండకారుణ్యంలోకి ప్రవేశించాలంటే దశాబ్ద కాలం క్రితం వరకు పోలీస్ బలగాలు వణికి పోయేవి

ఏ చెట్టు ఏ పుట్ట. ఏ గుట్టను చాటు చేసుకుని మావోయిస్టులు దాడి జరుపుతారో అన్న ఆందోళన పోలీస్ బలగాల్లో ఉండేది. మూకుమ్మడిగా ప్రయాణించిన సందర్భంలోనూ పోలీసులు మావోయిస్టుల దెబ్బకు విలవిలలాడిన సందర్భాలు పదుల సంఖ్యలో ప్రాణాలను పొగొట్టుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు దండకారుణ్యంలో సాయుధ పోలీస్ బలగాలు యధేచ్చగా సంచరిస్తున్నాయి. మావోయిస్టులు పెట్టని కోటలా చెప్పుకునే ఛత్తీస్గఢ్ దండకారుణ్యంలోనూ ప్రతి మూడు కిలోమీటర్లకు మరికొన్ని చోట్ల ప్రతి ఐదు కిలో మీటర్లకు, పది కిలో మీటర్లకు పోలీస్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అటవీ గ్రామాలను వదలకుండా అడవులను మొత్తం జల్లెడ పడుతున్నారు. గత మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే మావోయిస్టులు ఎదురు దెబ్బలు తిన్నారు తప్ప పోలీసులు దెబ్బతిన్న ఘటనలు చాలా స్వల్పం. మరో పక్క పోలీసులకు ఒకప్పుడు అటవీ గ్రామాల్లో నివసించే ప్రజల మద్దతు
అసలు ఉండేది కాదు. సాయుధ మావోయిస్టులను అటవీ గ్రామాల ప్రజలు ముఖ్యంగా గిరిజనులు కంటికి రెప్పలా…
కాపాడుకుంటూ పోలీసులు ఎంత హింసించినా మావోయిస్టుల జాడ చెప్పేవారు కాదు.
ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది
మావోయిస్టుల కంటే పోలీసులకు సమాచారం చేరవేయడం పట్ల ఉత్సుకత ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ ఉత్సుకతే మావోయిస్టుల ప్రాణాలు పెద్ద సంఖ్యలో పోవడానికి కారణమవుతుంది. దళాల రాక పోకలు నిశితంగా గమనిస్తూ పోలీసులకు సరైన సమాచారం ఇస్తుండడంతో దళాలు పోలీసులకు చిక్కి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. రక్షణ లేని స్థితికి మావోయిస్టు దళాలు చేరుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసు బలగాలకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నాయి. మావోయిస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ గణనీయంగా తగ్గిపోయింది. అదే సందర్భంలో ఆర్థిక, ఇతరత్రా వనరుల లోటు కూడా మావోయిస్టులను ఇబ్బందిపెడుతుంది. దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమం బలంగా పని చేసిన ప్పటికీ పాతికేళ్లుగా తెలంగాణ ప్రాంతం నుంచి సాయుధ ఉద్యమం వైపు ఆకర్షితులైన అనేక మంది మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించి అగ్ర నేతలుగా కొనసాగారు. వారి తర్వాత తరం ఆ తర్వాత మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు కావడం కానీ నాయకత్వ స్థానాలకు ఎదగడం కానీ జరగ లేదు. ప్రధానంగా సాయుధ బలగాల వైపు ఆకర్షించబడే ప్రాంతాల నుంచి మావోయిస్టు ఉద్యమం వైపు చూసేలా చేయడంలో నాయకత్వం ఘోరంగా విఫలం చెందింది. మారుతున్న యువత ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టి ప్రజా ఉద్యమాలు వైపు ఆకర్షించలేకపోయారు. దీనితో క్రమేపి సాయుధ బలగాల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan
all news paper telugu
ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ సారాంశాన్ని అర్థం
ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ సారాంశాన్ని అర్థం
చేసుకోలేని అనేక మందికి కూడా మావోయిస్టులు ఆయుధాలను ఇచ్చారు. వారు సిద్ధాంత నిబద్దత లేకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేరిన వారు కావడంతో ఒత్తిడి పెరగగానే లొంగుబాటు బాట పడుతున్నారు. ఈ లొంగుబాటు వార్తలు మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల తారక్క లొంగుబాటు మావోయిస్టు ఉద్యమ కొనసాగింపుపై తీవ్ర చర్చకు దారితీసింది. మావోయిస్టు ఉద్యమం సరి కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యూహాన్ని మార్చి ముందుకు సాగితే మరికొంత కాలం మనుగడ ఉండే అవకాశం ఉంది. రెండు దశాబ్దాలుగా కొత్త ప్రాంతాలకు విస్తరించాలన్న మావోయిస్టు పార్టీ ఆలోచన ఎక్కడ సఫలీకృతం కాలేదు. ఒకప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణలో తీవ్ర ప్రభావాన్ని చూపిన అప్పటి మావోయిస్టు పార్టీ అదేవిధంగా సింగరేణి కార్మిక సంఘం (సికాస) ఇప్పుడు అటువంటి ప్రభావాన్ని చూపేపరిస్థితిలో లేవు. సికాస ఆచూకీ కనుమరుగు కాగా మూడేళ్లుగా తెలంగాణలో అడుగు పెట్టిన మావోయిస్టు దళాలు పోలీసుల తుపాకీ గుండుకు బలైపోయాయి. వరుస ఘటనల తర్వాత తెలంగాణలో మావోయిస్టు పార్టీ పునర్ నిర్మాణం సాధ్యం కాదని లేదంటే అంత తేలిక కాదని అవగతమవుతుంది.పోలీసుల సంఖ్య గణనీయంగా పెరగడం అటవీ సమీప గ్రామాలు, ముఖ్యంగా గిరిజన ప్రజల మద్దతు మావోయిస్టులకు లేకపోవడం మావోయిస్టుల్లో రిక్రూట్మెంట్ లేకపోవడం నిబద్ధత కలిగిన కార్యకర్తలను తయారు చేసుకోవడంలో వైఫల్యం అన్నింటికి మించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ మావోయిస్టుల మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. ఈ విపత్కర పరిస్థితి నుంచి మావోయిస్టు పార్టీ ఏవైపుకు సాగుతుంది. దాని భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కార్యాచరణ సమాధానం చెప్పాలి.