ప్రగతిశీల సాహిత్యమే మార్గదర్శకం
హృదయ వేదనలు… మనిషులు ‘ మధ్య అగాథాలను సృష్టించే విద్వేషాలు కాదు
ప్రగతిశీల సాహిత్యమే మార్గదర్శకం| TELUGU NEWS
-
అతి సామాన్యుడి జీవితంలోనూ గుణాత్మక మార్పులు తీసు కొచ్చే ప్రగతిశీల సాహిత్యం ప్రస్తుత సమాజంలో అత్యవసరం
-
ఒకవైపు శాస్త్ర పరిశోధనలు వేగంగా ముందుకు దూసుకెళుతుంటే, మరోవైపు మూఢనమ్మకాలు
- ‘చర్విత చర్వణం’ అనిపించినా… ప్రజల్లో మార్పు రావాలంటే ప్రగతిశీల సాహిత్యం అవసరమని చెప్పక తప్పదు

గతంలో లేని ఎన్నో పిచ్చి నమ్మకాలు : ఇటీవల కాలంలో వింటున్నాం….
శాస్త్రీయ విజ్ఞానం కొద్ది మందికే పరిమితం కావ డం… వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించే రచ నలు లేకపోవడం మన దౌర్భాగ్యం.
‘వేదాల్లోనే అన్నీ ఉన్నాయష’ అని కరటక శాస్త్రి పాత్రతో అనిపిస్తాడు రచ యిత గురజాడ అప్పారావు తన ‘కన్యాశుల్కం’ నాటకం లో. ఇప్పటికీ చాలా మంది ఆలోచనా విధానం అదేకావ డం బాధాకరం.
తగినంతగా శాస్త్రీయ విజ్ఞాన సాహిత్యం రాకపోవడమే ఈ పరిస్థితికి ఒక కారణం. కొన్ని వేలు.. లేదా వందల సంవత్సరాల క్రితం నాటి పుస్తకాలను, గ్రంథాలను నేటికీ ప్రామాణికంగా తీసుకోవ డంలో అర్థం లేదు.
అప్పట్లో వారు తాము గమనించి, గ్ర హించిన విషయాలను ప్రస్తావించి ఉండవచ్చు. నేటి స __మాజానికి అప్పటి అభిప్రాయాలు లేదా సిద్ధాంతాలు భిన్నంగా పేరుతో నాటి ఆలోచవచ్చు. మతం లేదా సంప్రదాయం ఇప్పటికీ ప్రజల నెత్తిన రద్దు డం సరికాదు. ప్రమాదకరం కూడా. కాంతివేగాన్ని గూ ర్చి వేదాలు చెప్పాయనీ,
సూర్యుడికీ, భూమికీ దూరం గూర్చి వేదాల్లో ఉందనీ, కుజగ్రహంలో నీళ్ల గూర్చి మనకు తెలుసనీ, ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త అణుబాంబును పేల్చిన తర్వాత..
భగవద్గీతలోనూ అణుశ గురించిన విషయాలున్నాయనీ వాదించే వారిని ఏమ నాలి? టివి చానెళ్లు వచ్చి…
ప్రతి అంశాన్నీ డబ్బుతో ముడిపెట్టడం పెరిగిన తర్వాత, ఇలాంటి అర్థంలేని ప్రచా రాలు పెరిగాయి.
శాస్త్రవేత్తలను పిలిస్తే ఆర్థకంగా లాభం ఉండదని మతాధికారులనో, జోతిష్కులనో పిలిపించడం ఆనవాయితీగా మారింది. విధానం ఏదైతేనేం..
డబ్బు వచ్చిపడుతున్నది. సత్యాన్ని శాస్త్రీయంగా తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా…. రానీయకుండా అడ్డుకుఁ టున్నారు.
చాలా మంది రచయితలకు విరివిగా ప్రచార మవుతున్న మూఢనమ్మకాలు కనిపించకపోవడానికి కారణం ఏమిటో?
చాలా మంది వాదనలకు హేతుబద్ధత ఉండడం లేదు.
‘జోతిష్యం’ పేరుతో ప్రజలను భయభ్రాం తులను చేయడం నిత్యకృత్యమైంది.
జోతిష్యం సమష్టి అంశమైనప్పటికీ, దానిని వైష్ణక అంశంగా మార్చేశారు. గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చాలా మందికి తెలుసు.
ఖగోళ శాస్త్రంపై అవగాహన ఉన్నవారికి ఇంకా వివరంగా అర్థమవుతుంది. కానీ, ఆ సమాచారాన్ని కూడా వ్యాపా రంగా మార్చేస్తున్న
వారు.. ఎన్నిరకాలుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారో చూస్తునే ఉన్నాం. నిద్రలేచినది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ
అడుగడుగునా అను మానాలు ప్రాదిచేసుకుంటూ, అసహనంతో, అనవసర భయంతో రోజులు వెళ్లదీసే పరిస్థితికి మనిషిని నెట్టేస్తున్న వైనాన్ని గమనిస్తునే ఉన్నాం.
మానవ హితాన్ని కోరు కుంటే, ఈ కుళ్లును కడిగేయడానికి తక్షణ ప్రయత్నం
Also Read
ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు
district paper today
Manmohan కు భారతరత్న| Bharat Ratna to Manmohan
all news paper telugu
మొదలుకావాలి. విప్లవాత్మక ఆరోచనలకు, అభ్యుదయ భావాలకు బీజాలువేసే బలీయమైన శక్తుల్లో సాహిత్యం ఒకటి.
ఒక అక్షరం ఎన్నో మెదళ్లను కదిలిస్తుంది. ప్రగతి శీల సాహిత్యం మనిషి పురోవృద్ధికి తోడ్పడుతుంది.
ఆధు నిక విజ్ఞానం విస్తరిస్తున్నకొద్దీ ఎదురవుతున్న సవాళ్లు పెరుగుతున్నాయి. లెక్కలేనన్ని ప్రశ్నలు వచ్చిపడుతున్నాయి.
వాటికి సమాధానం వెతుక్కుంటూ, హేతుబద్ధ మైనవిశ్లేషణలు చేసుకుంటూ ముందుకు సాగడాన్ని మించిన పురోగవృద్ధి ఏముంటుంది?
శాస్త్రవేత్తలు సంవ త్సరాల పరిశోధనలు,అధ్యయనాలు జరిపి అందించిన సమాచారాన్ని కూడా ప్రజలకు అందించే పరిస్థితి లేదు. సైన్స్‌కు సంబంధించిన రచనలు రాకపోలేదు.
ఇంతకుముందు కానీ, వాటి వచ్చాయి… ఇప్పటికీ వస్తున్నాయి. 1 సంఖ్య చాలా పరిమితంగా ఉంది.
మిగతా సామాజిక అంశాలతో పోలిస్తే, ప్రగతిశీల, పరిశోధనాత్మక రచనలు నామమాత్రమే

ప్రపంచం వ్యాప్తంగా చాలా దేశాల్లో సైన్స్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నదిగానీ,
మన దేశంలో ఇంకా ఆ పరిస్థితి లేదు. భూమి గుండ్రంగా ఉందంటే నమ్మని వారు ఇప్పటికీ ఉన్నారు.
మానవ పరిణామ క్రమం గురించి డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని కొట్టిపారేసే వారి సంఖ్యకు కొదువ లేదు.
అయితే, వారంతా డార్విన్ సిద్ధాంతాన్ని వడపోసి, లోపాలు గుర్తించి, వాటిని సరి చేస్తూ ఏవైనా కొత్త ప్రతిపాదనలు చేయడం లేదు.
మతప రమైన అంశాలను ప్రామాణికంగా తీసుకొని, డార్విన్ సిద్ధాంతం తప్పని మొండిగా వాదిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల్లో నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని మించిన తిరోగమ నవాదం వేరొకటి లేదు.
ఇది కేవలం విద్యా సంబంధమైన అంశం కాదు.. మనిషి ఆలోనా సరళినని,
తద్వారా సమా జాన్ని ప్రభావితం చేసే కీలక పరిణామం. ఇలాంటి ఎన్నో
సమస్యలు సాతీకారుల రచనా వస్తువుగా మారాలి. అత్య ధికుల శ్రమను అతి
కొద్దిమంది అనుభవిస్తున్న రాజ్యంలో అవిశ్రాంత పోరాటాలకు సామాన్యుడిని సిద్ధం చేయాల్సిన
బాధ్యత రచయితలదే. చైతన్యవంతులనను చేసే బాధ్యత కూడా వారిదే.
‘బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు.
నరహంతలు ధరాధిపతులై

చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి’ అంటాడు శ్రీశ్రీ. బలవంతుల ఆధీనం నుంచి సామాన్యుడిని విడిపించాలి..
దోపిడి వర్గ కబంధహస్తాల నుంచి సగటు జీవికి విముక్తిని ప్రసాదిం చాలి. అందుకు పోరాటం ఒక్కటే మార్గం. శతాబ్దాల అణ చివేకు అలవాటుపడి, భయంతో మగ్గిపోతూ,
బలవంతు డిని ఎదురించలేక వణికిపోయే అణగారిన ప్రజలల్లో మార్పు కోసం పోరాట తత్వాన్ని
ధిక్కార స్వరం వినిపించేలా ప్రోత్సహించడాకి అనువైన సాహిత్యం ప్రస్తుతావసరం.
దానిని ప్రగతిశీల సాహిత్యం అని పిలిచినా, మరే ఇతర పేరు పెట్టినా సమస్య పేరు
కంటే శ్రీ సాహిత్య పరమావధి ముఖ్యం. దోపిడి అనేది అనాదిగా కొసాగుతున్నది.
అందుకే, అణతివేతకు వ్యతి రేక పోరాటం ఒక నిరంతర ప్రక్రియ. నిజమైన సాహితీకా రుడు నేలవిడిచి సాము చేయడు.
చరిత్ర మొత్తం వర్గ పోరాటాలమయమని మార్క్సిజం చెప్తున్నది.
నేటికీ అదే విధానం కొనసాగుతున్న వైనాన్ని మనం కళ్లతో చూస్తునే ఉన్నాం
మనిషి సామాజిక స్థితి అతనిలోని చైతన్య స్థాయిని నిర్ధారిస్తుంది.
దినందినం బతుకు పోరాటం చేసే బడుగుజీవి కష్టాలు, కన్నీళ్లతో కాలం గడుపుతాడే తప్ప, తెగించి పోరాడడానికి సాహసించడు. అయితే, సరైన
జరుగుతాయి.
ప్రేరణ లభిస్తే మాత్రం, ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడ తాడు. ఆ ప్రేరణ రచయితల వల్లే సాధ్యమవుతుంది.
వ్యాసాలు…పద్యాలు… పాటలు.. గేయాలు.. నవలలు… కథలు..
ఇలా ఎన్నో రకాల సాహితీప్రక్రియలు మను షుల్లో పరివర్తనకు బీజం వేస్తాయి.
అక్షరానికి ఉన్న శక్తి అలాంటిది. ఆచరణాత్మక మార్పు లేనంతకాలం దోపిడీ వ్యవస్థ నుంచి, అణచివేత నుంచి విముక్తి లభించదు. ఉద్యమాలతోనే ఈ మార్పు సాధ్యమవుతుంది.
బాధితులు చైతన్యవంతులైతేనే ఉద్యమ నిర్మాణాలు జరుగ సాహిత్యాన్ని
మించిన చైతన్య జ్వాలను రగిలించే ఎక్కడా లేదు. ఆధునిక చరిత్రలో ఎన్నో విప్లవాలు జరి గాయి. క్రూరమైన పాలన నుంచి, విపరీతమైన దోపిడి మంచి, అంతులేని అణచివేత నుంచి ఎన్నో దేశాలు.. ఎన్నో ప్రాంతాలు విముక్తిపొందాయి.
పంథాలు వేరు కాచ్చు.. సిద్ధాంతాల్లో వైవిధ్యాలు ఉండవచ్చు… నాల్లో వైరుధ్యాలు కనిపించవచ్చు.. కానీ, ప్రతి విప్లవ గమ్యం దోపిడిని అరికట్టడమే.
ఎలాంటి ప్రజా పోరాటానికైనా.. ఇంధనం మాత్రం సాహి త్యమే.
సిద్ధాంత వ్యాసాలు, స్ఫూర్తిని నింపే పాటలు ఏ విధంగా ప్రజలను కదిలించాయో మనకు తెలుసు. .
ఒక్క మాటలో చెప్పాలంటే, పోరాటాలకూ, సాహిత్యానికీ మధ్య ఉన్న సంబంధం అనివార్యం… అజరామరం.
ప్రగతిశీల సాహిత్యం అంటే కేవలం ఉద్యమాలకు ఊపిరిపో సేది మాత్రమే కాదు

దోపిడి రాజ్యాన్ని కూలదోసిన తర్వాత ఏర్పడే కొత్త సమాజ తీరుతెన్నులను వివరించేది
సుదీర్ఘమైన సామాజిక దశలను, తిరుగుబాటు తర్వాత నెలకొన్న పరిణామాలను అర్థం చేసుకొని, భవి ష్యత్ సమాజాన్ని ఆవిష్కరించేది కూడా ప్రగతిశీల సాహి త్యమే.
ఇలాంటి సాహిత్యం ప్రజలను మారుస్తుంది. సమాజాన్ని మారుస్తుంది. వికాసానికి బాటులు వేస్తుంది.
సిద్ధాం
వెరసి, సమసమాజ స్థాపనకు బీజాలు వేస్తుంది. ఏ సమా జమైనా.. ఏ సిద్ధాంతమైనా మార్పులకు అతీతం కాదు..
కాకూడదు. లోపరహితం” కాదు.. భేషజాలు లేకుండా వాస్తవాలను అంగీకరించి తీరాలి.
పెరుగుతున్న సాంకేతికత నుంచి మారుతున్న జీవన విధానాల వరకూ కాలానుగుణంగా
వస్తున్న మార్పుల నేపథ్యంలో తాలు కూడా మారాలి. మూల సూత్రాలకు, ప్రధాన
లక్ష్యాలకు భంగం వాటిల్లని మార్పును ప్రోత్సహించాలి. ఈ బాధ్యత కూడా రచయితలదే.
మార్పు అంటే విధ్వంసం, హింస కానవసరం లేదు. ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తే, సమాజం కూడా మారుతుంది.