అంబేడ్కర్ ఆరాధనలో పోటాపోటీ
ఇటీవల పార్లమెంటులో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ను లోకువ చేస్తూ
-
కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడం, దానిపై కాంగ్రెస్, బిజెపి ఎంపీలు సభ
-
నిరసన ప్రదర్శ నల సందర్భంగా అసాధారణ రీతిలో ద్వంద్వ యుద్ధాలు
-
అంబేడ్కర్ పోస్టర్లు పట్టుకొని ‘జై భీమ్!’ అంటూ గట్టిగా నిన దించడం వంటి అత్యంత తాజా పరిణామాలు
-
ఔన్నత్యం పెరిగిన భారత రాజకీయ ప్రము ఖుడు అంబేడ్కర్ అని అత్యంత నాటకీయంగా ధృవపడింది

ఆయన జన్మదినం సందర్భంగా ఆయనను అభిమానులు కొలుస్తుంటారు.
భారతదేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ తరు వాత అత్యధిక విగ్రహాలు కలిగిన
రెండవ వ్యక్తి అంబేడ్కర్. ప్రతి గ్రామం, ప్రతి కూడలిలో బట్టతలతో కూడిన
ఒక దృఢ మైన వ్యక్తి సూటు, టై ధరించి, రాజ్యాంగాన్ని స్ఫురించేలా పుస్తకాన్ని చేబూని మనకు కనబడతాడు. 1990లో మరణా నంతరం దేశ
అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ను ఆయ నకు ప్రకటించినప్పుడు,
ఆ పురస్కారం లభించడానికి ఇంత కాలం పట్టిందనే ఏకైక విమర్శ మాత్రమే వినిపించింది.
నేడు వామపక్షాలు, మితవాద బిజెపి, మధ్యేవాద కాంగ్రెస్, సిద్ధాంతరహిత ఆమ్ ఆద్మీ పార్టీ,
అందరూ అంబే డ్కర్ పట్ల తమ ఆరాధనను చాటుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటాన్ని పెట్టాలని పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం తీసుకున్న
నిర్ణయం ఆయనకు దక్కిన మూర్తిమత్వ హోదాకు ఉదాహరణ. సామాజిక శాస్త్ర వేత్త బద్రీ నారాయణ్ పేర్కొన్నట్లుగా “ఒకవేళ బాబా సాహెబ్ అంబేడ్కర్ బతికి
ఉన్నట్లయితే, పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన రాజకీయ పార్టీలు ఆయన వ్యక్తిత్వంతో అనుబంధం కోసం పోటీ పడడాన్ని చూసి తప్పకుండా అమి తాశ్చర్య పడుతుండవచ్చు.”
నిజానికి అంబేడ్కర్ జీవితం, చేసిన కృషిని ప్రజల మదిలో మరింత ఎక్కువగా నింపే
విధంగా మునుపెన్నడూ లేనట్లుగా పునరావిష్కరణం, పునః ప్రతిష్టించడం జరిగింది.
గతంలో కంటే ఎక్కువగా దళితులలో రాజకీయ చైతన్య పెర గడం, ఓటర్లలో 16.6 శాతంగా


దళిత ఓటర్లను ఆకట్టు కునేందుకు రాజకీయ పార్టీలు అంబేడ్కర్ స్వప్నాన్ని సాకారం చేసేం దుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడమే ఇందుకు కారణమని నారా యణ్ పేర్కొన్నారు.
అంబేడ్కర్ అగ్ర కుల వ్యవస్థను ఎంత నిర్ద్వంద్వంగా విమర్శిం చారంటే,
ఆయనను సముచితంగా గౌరవించడం ద్వారానే వ్యతిరేక తను తగ్గించుకోవడం ఉత్తమమని వారు భావిస్తున్నారంటూ యువ దళిత రచయిత యాషికా దత్ వాదిస్తున్నారు.

ఆయన సాహసోపేత ఆలోచనలకు అనుగుణంగా పని చేయకుండానే పార్టీలు దళిత ఓట్లు కోరుకుంటున్నాయి.
ఇది భారతదేశంలో అంబేడ్కర్ పట్ల నూతన ఆధిపత్య హిందూ త్వ ఉద్యమం అనుసరిస్తున్న వైఖరిలోనూ స్పష్టమవుతుంది.
హిందూ వాదం పట్ల ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు, దళితుల సమీకరణ కారణంగా తొలుత ఆయనను తిరస్కరించారు.
ఎందుకంటే ఆయన విమర్శలన్నీ హిందువుల ఐక్యత నొక్కిచెప్పే ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకం గానే ఉండేవి. అయితే, ఆయన ఇస్లాం లేదా క్రైస్తవానికి బదులుగా
భారతీయ మూలాలు కలిగి ఉన్న బౌద్ధమతంలోకి మారటాన్ని ఎంపిక చేసుకోవడంతో వారు
కొంత ఊరట చెందారు. దీంతో ఆయన మరణించిన తరువాత ఆయనను గౌరవిస్తూ మాట్లాడడం ప్రారంభించారు.
ఆర్ఎస్ఎస్ కు చెందిన ఇద్దరు ప్రముఖ సిద్ధాంతకర్త లు దత్తోపంత్ తేంగడి,
కృష్ణ గోపాలు అంబేడ్కర్పై పుస్తకాలు కూడా రచించారు. ఆర్ఎస్ఎస్ 1990లో అంబేడ్కర్ శతజయంతి ఉత్సవాలను కూడా నిర్వహించింది.
హిందూ సమాజంలో సంస్కర ణలు తీసుకువచ్చారని, అందులోని వివక్షాపూరిత ఆచారాలు
అంబేడ్కర్ ఆరాధనలో పోటాపోటీ|Telugu News
అన్యా యాలను తొలగించేందుకు కృషి చేశారని శ్లాఘించింది కూడా.
ఆయన 125వ జయంతి నాటికి బిజెపి పూర్తిగా ఉత్సవ వాతావరణంలోకి వెళ్ళిపోయింది.
ఆయనను సముచితంగా గౌరవిస్తున్నట్లు చెప్పుకునేందుకు వేగంగా అడుగులు వేస్తూ,
ప్రధాన మంత్రి మోదీ పదేపదే అంబేడ్కర్ ఉపన్యాసాలు ఉటంకించడం, బిజెపి బడా నేతలు స్థానిక అంబేడ్కర్
జయంతి వేడుకల్లో ప్రతి ఏటా హాజరుకావడం వంటి చర్యలకు పూనుకున్నారు.
ఇటీవల కాలంలో బిజెపి ఏకంగా అంబేడ్కర్ జన్మదినాన్ని ‘సామాజిక న్యాయ వారోత్సవం’గా పొడిగిం చి నిర్వహించడం ప్రారంభించింది.
భారతదేశంలోని అనేక ప్రభుత్వ సంస్థలకు ఆయన పేరు పెట్టి గౌరవించింది.
అందులో నాగ్పూర్ లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం,
జలంధర్ ని బి.ఆర్.అంబేడ్కర్ నేష నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
ఢిల్లీలో అంబేడ్కర్ యూనివర్సిటీ (జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకీ ఆయన పేరుతో పునఃనామ
కరణం చేసి ఆయన పేరుతో రెండవ యూనివర్సిటీ ఆలోచన కూడా ఉంది) వంటి వైవిధ్య సంస్థలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలు విస్తరించడమే కాకుండా, అంబేడ్కరు స్తుతించే పేరుత

వాటిని మరింత భారీగా, గౌరవప్రదం గా, చట్టబద్ధంగా, శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని లాతూర్ 2022 ఏప్రిల్ లో ‘స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్’ పేరుతో
ఆయన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ కూడా హుస్సే
న్సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ గార్టెన్ పక్కన 125 అడుగుల విగ్ర హాన్ని ఏర్పాటు చేసింది.
మహారాష్ట్ర ఈ విషయంలో వెనకబడలేదు. ఆయన సొంతూరు ముంబైలో రూ.1000కోట్లతో 400 అడుగులతో,
50 అంతస్తుల ఎత్తు, 80 టన్నుల బరువుతో, కాంస్యం, ఉక్కుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహానికి శ్రీకారం చుట్టింది.
“2022 మే లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోన సీమ జిల్లాగా మార్చింది
అంబేడ్కర్ ఆరాధనలో పోటాపోటీ|Telugu News
అలాగే విజయవాడలో 150 అడుగుల కాంస్య విగ్రహం నెలకొల్పింది.
ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక నగరానికి మొత్తం అంబేడ్కర్ పేరు పెట్టే తదుపరి చర్య ఎంత దూరంలో లేదు.
భారతదేశంలో మరణించిన తరువాత గౌరవించబడు తున్న రాజకీయ నాయకుడు అంబేడ్కర్..
ఎన్నికల్లో గెలుపుకంటే ఎక్కువగా ఓటమి చవిచూడడం, ఆయన ఏర్పాటు
చేసిన పార్టీలు తనలాగా జాతి ప్రతిధ్వనిని సాధిం చటంలో విఫలమవడం వంటి
విషయాలు వింటే అది నమ్మశక్యం కాదేమో! కాబట్టి అంబేడ్కరు గౌరవించడం లో నిజంగానే ఆయన ఆలోచనలు,
ఆశయాల పట్ల ఏ మేరకు నిజాయితీ ఉందీ లేక ఆ ఆరాధన రాజకీయ లబ్ది కోసం

సంకేతాత్మకమేనా అనేది చర్చనీయాంశమే.
అంబేడ్కరు “నేడు సామాన్య భారతీయులకు అత్యంత అర్థవంతమైన రాజ్యాంగ
వ్యవస్థ నిర్మాతగా” చరి త్రకారుడు సునీల్ ఖిల్నాని పరిగణిస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 1994లో ఏర్పాటైన అంబేడ్క రైట్ స్టూడెంట్స్ అసోసియేషన్, జెఎన్
యులో బిర్సా- అంబేడ్కర్–ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్, ఐఐటీ మద్రా స్లో అంబేడ్కర్ –
పెరియార్ స్టడీ సర్కిల్ వంటి విద్యార్థి సంఘాలు క్యాంపస్లలో అంబేడ్కర్ ఆలోచనలను ప్రచారం చేయటానికి సహాయపడుతున్నాయి.
Also Read
అంబేడ్కర్ ఆరాధనలో పోటాపోటీ|Telugu News
telugu news daily
గర్వపడే మహారాణి|Telugu News
news LATEST UPDATES telugu
ప్రపంచ కార్మికవర్గ శ్వాస కామ్రేడ్లెనిన్TeluguNews
news updates daily
ప్రగతిశీల సాహిత్యమే మార్గదర్శకం| TELUGU NEWS
telugu news daily telangana
The man who attacked Bollywood actor Saif Ali Khan has been
telugu news daily day to day news
ప్రపంచ ఆర్థిక వేదికకు ట్రంప్ ఎజెండా TELUGU NEWS
news paper nws updates
ప్రార్థనాస్థలాన్ని ప్రయోగశాల చేసిన విక్రమ్ సారాభాయ్
all news updates
Daughter has right to pressure parents to pay for education|
31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
NEWSLOCAL NEWSNEWSPOLITICAL
ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు
natonal newsd daily
మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan
international news in telugu
తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu
విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అంబేడ్కర్ ఆలోచన వైపు కొత్తవారిని ఆకట్టుకుంటున్నాయి.
“ఎంత కాలం జీవించాం అనే కంటే ఎంత గొప్పగా జీవించామనేది ముఖ్యం” అని అంబేడ్కర్ ఒకసారి పేర్కొన్నారు.
అరవై ఐదు సంవత్సరాలు అనేది దీర్ఘకాల జీవితమేమి కాదు. కానీ, అది గొప్పదైనదని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
“అత్యంత గొప్ప భారతీయుడు’ అనే అంశంపై 2012లో రెండు టివి ఛానల్స్ నిర్వహించిన సర్వేలో 2 కోట్ల మందికి పైగా ఓటు వేశారు.
గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ల కంటే అంబేడ్కరు అత్యధిక ఓట్లు లభించాయి
ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ మొదలు, ఆయనను విమర్శించి న హిందూత్వ
యోధుల వరకు భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ నేడు ఆయన పట్ల ప్రశంసాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఆయన ఎవరూ సవాలు చేయడానికి వీలులేని అరుదైన సర్వఆరాధ్య మంది రంలోకి ప్రవేశించారు.
మరణించిన ఏడు దశాబ్దాల తరువాత అంబే డ్కర్ నేడు నిలువెత్తు మనిషిని మించిన మూర్తిగా వెలుగొందుతు న్నారు.
ఆయన ఎదుగుదల కొనసాగుతూనే ఉంటుంది.