daily news in telugu

76 ఏళ్ల ఆల్టైమ్ రికార్డ్ప కన్నేసిన కోహ్లి!

76-year-old all-time record Kohli|Telugu news

daily news in telugu

76-year-old all-time record Kohli|Telugu news టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో రికార్డు చేరువయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై మరో శతకం సాధిస్తే వేరే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్మన్ రికార్డ్ను సమం చేస్తాడు. ఆసీస్కు చెందిన డాన్ బ్రాడ్మన్ ఇంగ్లండ గడ్డపై 11 శతకాలు నమోదు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి ఆసీస్ గడ్డపై 10 శతకా లతో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో జేబీ హాబ్స్ (9 సెంచరీలు ఆస్ట్రేలియాపై), సచిన్ (9 సెంచరీలు శ్రీలంక) ఉన్నారు. కోహ్లి మరో రెండు సెంచరీలు నమోదు చేస్తే డాన్ బ్రాడ్ మన్ రికార్డ్ను అధిగమిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి ఇప్పటికే ఓ శతకం బాది సూపర్ ఫామ్లో ఉన్నాడు. పెర్త్ వేది కగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో కోహ్లి సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధిం చింది. శుక్రవారం నుంచి ఆడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్లో ఆతిథ్య ఆసీస్తోతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో కోహ్లి
శతకం సాధిస్తే బ్రాడ్ మన్ రికార్డ్  చేస్తాడు.

అడిలైడ్లో కోహ్లికి మెరుగైన రికార్డ్ ఉంది

ఇక అడిలైడ్లో కోహ్లికి మెరుగైన రికార్డ్ ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 15 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లి 957 పరు గులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లి మూడు శత కాలు, హాఫ్ సెంచరీతో 509 పరుగులు చేశాడు. ఇక కోహ్లి మరో సెంచరీ సాధిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయ ర్గా కోహ్లి రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికా ర్డును సచిన్ టెండూల్కర్తో కలిసి కోహ్లి సంయు క్తంగా పంచుకున్నాడు. 65 ఇన్నింగ్స్ సచిన్, 44 ఇన్నింగ్స్లో కోహ్లి తొమ్మిది సెంచరీలు చేశారు.

top ad blockers for chrome

డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్ ను

సచిన్, కోహ్లి తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (8 సెంచరీలు 51 ఇన్నింగ్స్లు), స్టీవ్ స్మిత్ (8 సెంచరీలు 37 ఇన్నింగ్స్లు), మైకేల్ క్లార్క్ (7 సెంచరీలు 40 ఇన్నింగ్స్లు) ఉన్నారు. కాగా, రెండో టెస్టులో కోహ్లి మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్ ను
అందుకున్న తొలి భారత ప్లేయర్గా కోహ్లి ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ వేది కలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్గా లారా రికార్డును కోహ్లి అధిగమి స్తాడు. అడిలైడ్లో లారా 611 పరుగులు చేయగా కోహ్లి 509 పరుగులు చేశాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. పింక్ బాల్తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.

76-year-old all-time record Kohli!current news in ap in telugu
daily eenadu paper
daily news in telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *