Lack of employment.. Life is heavy..Lack of employment.. Life is heavy..
Lack of employment.. Life is heavy..

ఉపాధి కరువై.. బతుకు భారమై..

Lack of employment.. Life is heavy..

Lack of employment.. Life is heavy..

>ఉపాధిలేక మల్లన్నసాగర్ నిర్వాసితుల అవస్థలు కుటుంబ పోషణకు అష్టకష్టాలుపడుతున్నవైనం

• అడ్డా కూలీలుగా మారుతున్న నిర్వాసిత కుటుంబాలు 

• తక్కువ కూలి ఇచ్చినా పొలం పనికి వెళుతున్న మహిళలు

•గజ్వేల్ లో ఉపాధి దొరకని పరిస్థితి

• ఉపాధి లేక వలస వెళుతున్ననిరుద్యోగులు

Lack of employment.. Life is heavy..
Lack of employment.. Life is heavy..

Lack of employment.. Life is heavy..  మల్లన్నసాగర్ భూ నిర్వాసి తులు ఉపాధి లేక గజ్వేల్ ఆర్ఆండ్ఆర్ కాలనీ లో అష్టకష్టాలు పడుతున్నారు.

ఉపాధి కరువై బ్రతుకు భారం అయి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ఇళ్ల నిర్మాణాలకు అప్పులు చేసి వాటిని ఎలా తీర్చాలో మార్గం లేక అయోమయానికి లోనౌతున్నారు. కాగా ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 14గ్రామాల నిర్వాసితులకు ఉపాధి కల్పించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు.

నిర్వాసితు లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ ప్రజాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి తరలించి వారికి జీవ నోపాధిని కల్పించలేకపోవడంతో నిర్వాసితులు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారు.

పల్లె ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి రావడంతో నిర్వాసితులు ప్రతి నిత్యావసర వస్తువును కొను కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కుటుంబ ఖర్చులు కూడా పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.ఒకపక్క ఖర్చులు పెరగడం మరో పక్క ఉపాధి లేకపోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా తయారైంది. కుటుంబ ఖర్చులు
తీరాలంటే కొందరు అద్దామీది కూలీలుగా మారుతున్నారు.

గజ్వేల్ లో ఉపాధి దొరకకపో వడంతో తక్కువ కూలీ ఇచ్చినా సరే పంట చేన్లకు పనికి వెళుతున్నారు.

Lack of employment.. Life is heavy..
Lack of employment.. Life is heavy..

14 గ్రామాలను ఓకే దగ్గర చేర్చి.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన కొండపాక మండలంలోని సింగారం, ఎర్ర వల్లి, తొగుట మండలంలోని రాంపూర్, బ్రాహ్మ ణబంజేరుపల్లి,లక్ష్మాపూర్ ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లె పహాడ్,

వేములఘాట్ గ్రామలతో పాటు వాటి మధిర గ్రామాలతో కలిపి 14గ్రామాలను ఒకే దగ్గర చేర్చడం కారణంగా ఉపాధి దొరకడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని

Lack of employment.. Life is heavy..

నిర్వాసిత కుటుంబాలను ఒకే దగ్గర కాకుండా ఉపాధి అవ కాశాలు ఉన్న ప్రాంతాలలో వేర్వేరుగా వేస్తే జీవ నోపాధి దొరికే అవకాశం ఉందంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కంపె నీలను నెలకొల్పి నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తా మని హామీ ఇచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని నిర్వాసితు లకు ఉపాధి లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభు త్వం కూడా నిర్వాసితులకు ఉపాధి కల్పించడం లో ఫెయిలయ్యిందన్నారు.

Lack of employment.. Life is heavy..

ALSO READ

భారత్ ప్రపంచ దేశానికి ఆశా కిరణం!!!! | India is a ray!!! of hope for the world

THILAKVARMA is an opportunitygrabber

రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!

నవంబర్ 15న గురునానక్ జయంతి!

రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు

ఫీఫా క్వాలిఫయర్ మ్యాచ్లు |FIFA Qualifier Matches|

100 రోజుల పని దినాలను సైతం కోల్పోవడంతో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటు న్నారు

ఉపాధి హామీ పథకం లేకపోవడం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు వారి గ్రామా లను కోల్పోయిన నాటి నుండి మహాత్మగాంధీ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లభించే 100 రోజుల పని దినాలను సైతం కోల్పోవడంతో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటు న్నారు. కాలనీల్లో చేయడానికి పనిలేక, ఇతర ఉపాధి మార్గం కాన రాక నిర్వాసిత కుటుంబాలు సతమతమవుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్వాసితులకు పని దినా లను కల్పించాలని కోరుతున్నారు.
సబ్సిడీ రుణాలను అందివ్వాలి.

Lack of employment.. Life is heavy..

సబ్సీడీపై వాహనాలను, ఇతర పని ముట్లను అందివ్వాలని కోరుతున్నారు

స్వయం ఉపాధిని పొందే విధంగా నిర్వాసిత కు టుంబాలకు ప్రభుత్వం సబ్సీడీపై రుణాలను అందివ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఉపాధి మార్గాలను అన్వేషించి యువకులకు ఉపాధి కల్పించాలని, సబ్సీడీపై వాహనాలను, ఇతర పని ముట్లను అందివ్వాలని కోరుతున్నారు. కంపెనీ లను నెలకొల్పి అందులో భూ నిర్వాసితులకు ఉద్యోగాలను కల్పించాలని కోరుతున్నారు. Lack of employment.. Life is heavy..

Lack of employment.. Life is heavy..

 

People also ask

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *