Land worth Rs.7 crores kabja|TELUGU NEWSall news paper telugu

రూ.7 కోట్ల విలువైన భూమి స్వాహా

Land worth Rs.7 crores kabja|TELUGU NEWS

చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు

  •  సుమారు ఆరున్నర
  • ఎకరాల భూమి మాయం
  • ఫేక్ ఆధార్కార్డు తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ సంగారెడ్డి జిల్లాలో
  • మాజీ ప్రజాప్రతినిధి నిర్వాకం • ఆయనకు సహకరించిన
ap news telugu todayap news updates in telugu telugu latest news
today telugu varthalu

రెవెన్యూ ఆఫీసర్లు కలెక్టరేట్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు లింకులు 

Land worth Rs.7 crores kabja | TELUGU NEWS ఒకప్పుడు మహా నగరాలకు పరిమితమైన ఫేక్ భూ రిజిస్ట్రేషన్లు గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న భూములపై కన్నేసి కాజేస్తున్నారు.

ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరుతో విలువైన భూములను స్వాహా చేశారు.

ఎప్పుడో ప్రాణం పోయిన వ్యక్తిని ఆందోల్ మండలంలో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మళ్ళీ బతికించారు.

చనిపోయిన వ్యక్తి పేరుతో ఫోర్టరీ డాక్యుమెంట్లు తయారు చేసి భూముల్ని మాయం చేశారు.

తమకున్న రాజకీయ పలుకు బడి, అధికారుల అండతో పరాయి భూమిని తమ వశం చేసుకున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా అందోల్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం రేపే భారీ భూ కుంభకోణం చోటు చేసుకుంది.

 

రూ.7 కోట్ల విలువైన ఆరున్నర ఎకరాల భూమి కొట్టేశారు

ఆందోల్ మండలం డాకూర్ గ్రామ రెవెన్యూ పరి ధిలోని సర్వే 679లోచనిపోయిన వ్యక్తి పేరుతో పొర్జరీ ఆధార్ కార్డు తయారు చేసి సుమారు రూ.7 కోట్ల విలువైన ఆరున్నర ఎకరాల భూమి కొట్టేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తి సర్వే నం.679 సుమారు ఆరున్నర ఎకరాల భూమిని స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేశాడు.

అప్పటి నుంచి మధ్య మధ్యలో తన భూమిని చూసుకు నేందుకు తరచు వచ్చేవాడు.

ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించడంతో భూమి ద గ్గరకు ఆ యజమానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏండ్ల తరబడి ఎవ్వరూ రాకపోవడంతో ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఆ భూమి పై కన్నే శారు. సదరు వ్యక్తికి వారసులు లేరని భావించి ఎలాగైనా ఆ విలువైన భూమిని కొట్టేయడానికి పక్క స్కెచ్ వేశాడు. అనుకున్నదే తడవుగా తనకు దగ్గర ఉండే మరొక ప్రజా ప్రతినిధికి తక్కువ ధరకు భూమి ఇప్పిస్తానని నమ్మబలికాడు.

స్కెచ్ వేసి భూమిని కాజేశారు.. డాకూర్ గ్రామంలోని సర్వేనెంబర్ 679 కి.

ఆందోల్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి సహ కారంతో మరణించిన వ్యక్తికి సంబంధించిన
ఆధార్ కార్డును సేకరించారు. చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డుతో సదరు మాజీ ప్రజా ప్రతినిధి ఫోటోను మార్ఫింగ్ చేశారు.

ఆధార్ కార్డు ఫోటో అదే అధికారి సహాయంతో ఆధార్ కార్డులో మార్పింగ్ తో పాటు వేరే మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డుకు జతచేసి పక్క పథకం
రచించారు. ఆ తర్వాత 2023 feb 23న మరో వ్యక్తి ద్వారా పట్టా పాస్ పుస్తకానికి adharcard జత చేశారు. ఆ తర్వాత అదే మరో వ్యక్తిని భూ యజమానిగా చూపించి 2023 మార్చి 28 న మరో మాజీ ప్రజా ప్రతినిధికి భూమిని విక్రచారు.
మళ్ళీభూమి విక్రయం.. సర్వేనెంబర్ 679లో వివాదాస్పద భూమిని కొనుగోలు చేసిన మరో మాజీ ప్రజాప్రతినిధి
భూమిని తిరిగి పలువురికి విక్రయించారు.

local news telugu

రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!

news today in telugu telangana

నవంబర్ 15న గురునానక్ జయంతి!

రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు

to newspaper telugu

ఫీఫా క్వాలిఫయర్ మ్యాచ్లు |FIFA Qualifier Matches|

ఆ భూమిని వేరే వాళ్లకు విక్రయించారా..

నకిలీ ఆ రిజిస్ట్రేషన్ తో భూ రిజిస్ట్రేషన్ చేసిన విషయం సదరు ప్రజా ప్రతినిధికి తెలిసి ఆ భూమిని వేరే వాళ్లకు విక్రయించారా..? లేక విషయం తెలియక విక్రయించారా..? అనేది తెలియాల్సి ఉంది.

నకిలీ ఆధార్ కార్డు తో రిజిస్ట్రేషన్ చేసిన విషయం తనకు తెలియదని ఆ భూమిని కొనుగోలు చేసిన ప్రజా ప్రతినిధి పలువురి దగ్గర వాపోతున్నట్లు
వశిష్ఠ ఎగ్జిక్యూటివ్ మెడిసైట్ జాయింట్ సబ్ రిజిస్ట్రాల్.
తెలుస్తోంది.

నకిలీ రిజిస్ట్రేషన్ విషయం తెలియక తాము భూమిని కొనుగోలు చేశామని ఇప్పుడు

వివాదం బయటపడిందిలా..

డాకూర్ గ్రామంలో గతంలో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి అనారోగ్యంతో మరణిం చారు.

అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన

వారసురాలు విదేశాల్లో నివాసం ఉంటు న్నట్లు తెలుస్తోంది. మరణించిన సమయంలో ఆస్తుల విషయంలో పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది.

చేస్తుండ గా డాకూర్ గ్రామానికి సంబంధించిన భూమి
పట్టా పాస్ బుక్కులు లభ్యమైనట్లు సమాచారం. సదరు సర్వేనెంబర్లను ధరణిలో చెక్ చేయగా తమ తండ్రి పేరు ఉన్న

భూమిలో వేరే వ్యక్తుల పేర్లు దర్శనమీయడంతో వారు అవాక్కయ్యారు.

పొలిటికల్ ఒత్తిడితో పోలీస్ అధికారులను మేనేజ్ చేసినట్లు

Land worth Rs.7 crores kabja | TELUGU NEWS

ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తమ కుటుంబానికి స్నేహితుడైన ఒక ఐపీఎస్ అధికారి దృష్టికి తీసుకు వెళ్లడంతో దొంక కదిలింది.

అయితే అక్రమ భూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు రాజకీయ పలుకుబడి ఉండడంతో

ఈ విషయం బయట పొక్కకుండా అసలైన భూ యజమాని కుటుంబ సభ్యులతో బేరసారాలకు దిగినట్లు తెలిసింది. అయితే సదరు వ్యక్తులు
వీరితో సెటిల్మెంట్కు ససేమీరా అనడంతో తమ కున్న పొలిటికల్ ఒత్తిడితో పోలీస్ అధికారులను మేనేజ్ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ విషయంలో ఫిర్యాదు వచ్చిన పోలీసు అధికా రులు ఈ విషయాన్ని

తొక్కిపెట్టడంతో సదరు కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయిం చారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికా రులు ప్రస్తుతం ఆ భూమిని నిషేధిత జాబితాలోచేర్చారు.

చనిపోయిన వ్యక్తి పేరుతో ఆధార్ కార్డును సృష్టించినట్లు

అయితే సామాన్యులపై చిన్న ఆరోపణ వస్తేనే చర్యలకు ఉపక్రమించే పోలీసు

రెవెన్యూ అధికారులు ఇంత పెద్ద భూ కుంభకోణం బయటకు వచ్చిన మౌనంగా ఉండడం స్థానికంగా చర్చనీయాంశమైం ది.

చనిపోయిన వ్యక్తి పేరుతో ఆధార్ కార్డును సృష్టించినట్లు పక్క ఆధారాలున్న సద్గురు వ్యక్తులపై పోలీస్ శాఖ

చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ భూత తంగంపై సహకరించి కబ్జాదారులకు కొమ్ముకా స్తున్న అధికారుల భరతం పట్టాల్సిన అవసరం ఉంది.

ఆధార్ కార్డు ఫోర్జరీ చేసి పోలీస్ శాఖ తో పాటు రెవెన్యూ శాఖను తప్పవ పట్టించిన సదరు మాజీ

ప్రజాప్రతినిధులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది.

Land worth Rs.7 crores kabja | TELUGU NEWS

JOIN TELEGRAM 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *