చదువుల్లో విశ్వవిఖ్యాతి…’లైంగిక వేధింపుల’ దుర్వినీతి !
-
ఢిల్లీ ‘జెఎన్ యు’ విశ్వరూపం 2017 నుంచి అంతర్గత ఫిర్యాదుల కమిటీకి అందిన 151 ఫిర్యాదులు
corruption of sexual harassment TeluguNews దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నె
హ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్ యు) చదువుల్లోనే కాదు లైంగిక వేధింపుల ఫిర్యాదులలోనూ టాప్లనే
నిలవడం ఆశ్చర్యంకలిగించకమానదని తాజా సమాచారం వెల్లడించింది.
జెఎన్యు 2017సంవత్సరం నాటినుండి ఇప్పటివరకు 151 లైంగిక
వేధింపుల ఫిర్యాదులను స్వీకరించడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
ఈ ఫిర్యాదులలో దాదాపు 98శాతం ఫిర్యాదులను పరిష్కరించామని
వేధింపులకు వ్యతిరేకంగా జెండర్ సెన్సేషన్ కమిటీ ఎగైనెస్ట్ హరాస్మెంట్ (జిఎసిసిఎఎస్ హెచ్) స్థానంలో

ఈ ఏడాది దాని అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి) ఏర్పాటైంది.
సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద చేసుకున్న దరఖాస్తుపై
జెఎన్ యు నుంచి అందిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిం
చింది. అయితే ఈ ఫిర్యాదులలో దాదాపు 98శాతం ఫిర్యాదులను పరిష్కరించామని, కేవలం మూడు ఫిర్యాదులు మాత్రమే
పెండింగ్ ఉన్నాయని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
తెలిపింది.
కేవలం ఒక్క ఏడాదిలోనే 63ఫిర్యాదులతో అత్యధిక కేసులు నమోదు
ఇదిలా ఉంటే ఫిర్యాదులు స్వభావం, నిందితులపై
తీసుకున్న చర్యల సమాచారం గురించి అడగగా, వాటిని వెల్ల
డించడానికి విశ్వవిద్యాలయం నిరాకరించింది. ఆ సమాచారం
గోప్యతకు సంబంధించినదని జెఎన్ యు తెలియజేసింది.
2018–19సంవత్సరంలో కేవలం ఒక్క ఏడాదిలోనే 63ఫిర్యాదులతో అత్యధిక కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు
చెబుతున్నాయి. కొవిడ్ 19 మహమ్మారి సంవత్సరాలలో లైంగిక
వేధింపుల ఫిర్యాదులు గణనీయంగా తగ్గిపోయాయి. 2019–
2021సంవత్సరాల మధ్య ఈ తరహా ఫిర్యాదులు 6ఫిర్యాదులు
మాత్రమే నమోదు అయ్యాయి. బహుశా క్యాంపస్ కార్యకలాపాలు తగ్గిన కారణంగా ఫిర్యాదులు తగ్గి ఉంటాయని లోతుగా
పరిశీలిస్తే అర్థమైంది.

Universal fame in studies…the corruption of ‘sexual harassment’! | Telugu News
అయితే ఇటీవల మళ్లీ లైంగిక ఫిర్యాదులు పెరిగిపోయాయి
2022–2023 కా లంలో 30లైంగిక ఫిర్యా
2023–2024కాలంలో 30లైంగిక ఫిర్యాదులు
అందాయి. 2017–18 పీరియెడ్లో 17కేసు లు రిజిస్టర్ కాగా,
2018–2019కాలంలో 63, 20192020 లో 5 కేసులు,
2020–20221 కాలంలో ఒక కేసు, 2021–22పీరియెడ్లో
5కేసులు నమోదైనట్టు సమాచార హక్కు చట్టం కింద జెఎన్ యు
అందజేసిన డేటా వెల్లడించింది. 2015లో ఢిల్లీ మహిళా కమి
షన్ వెల్లడించిన ప్రకారం… 2013 నుంచి 2015 సంవత్సరాల
మధ్య ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో 51కేసులతో నగరం
లోని విద్యాసంస్థలలోకెల్లా జెఎన్ యులోనే అత్యధిక లైంగిక
వేధింపుల కేసులు నమోదయ్యాయని తెలియజేసింది. ఆ
కాలంలో ఢిల్లీ విద్యాసంస్థలలో ఈ తరహా ఫిర్యాదులు అందడం
ఇది దాదాపు 50శాతంగా ఉం దని తెలిపింది.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల పరిస్థితికి దర్పణం పట్టింది.
corruption of sexual harassment TeluguNews యూనివర్సిటీ అధికారులకు ఇచ్చిన లైంగిక వేధిం పుల ఫిర్యాదులపై నిష్క్రియాత్మక ధోరణిని నిరసిస్తూ జెఎన్ యుకు చెందిన రెండవ సంవత్సరం విద్యార్థిని వరుసగా 12 రోజులపాటు క్యాంపస్ మెయిన్ఎంట్రెన్స్ వద్ద నిరవధిక సమ్మె చేయడం జవహర్లాల్ నెహ్రూ
విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల పరిస్థితికి దర్పణం పట్టింది.
అక్టోబరులో క్యాంపస్ ప్రెషర్స్ వేడుకల పార్టీ సందర్భంగా జరి
గిన లైంగిక వేధింపులు, హింసకు సంబంధించి 47 మంది
విద్యార్థులు అంతర్గత ఫి ర్యాదుల కమిటీ (ఐసిసి)కి సంయుక్తంగా ఫిర్యాదు చేశారు.
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
breaking news in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu
ఫీఫా క్వాలిఫయర్ మ్యాచ్లు |FIFA Qualifier Matches|
ఫిర్యాదు చేస్తే యూనివర్సిటీ నిష్క్రియాత్మకంగా
ఏ ప్రిల్ మాసంలో సెంటర్ ఫర్ చైనీస్సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ విద్యార్థిని యూనివర్సిటీలో తన ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధించాడని, ఫిర్యాదు చేస్తే యూనివర్సిటీ నిష్క్రియాత్మకంగా వ్యవహరించిన కారణంగా తాను
యూనివర్సిటీ నుంచి వెళ్లి పోవాల్సివచ్చిందని ఆరోపించడం గమనార్హం.
ఈ సంఘటనలు విస్తృత నిరసనలకు దారితీశాయి.
corruption of sexual harassment TeluguNews
breaking news today tamil nadu