ప్రపంచ ఆర్థిక వేదికకు ట్రంప్ ఎజెండా
ప్రపంచ ఆర్థిక వేదికకు ట్రంప్ ఎజెండా TELUGU NEWS
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న
-
జనవరి 20వ తేదీనాడే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్)55వ సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్నాయి.
-
బహుళజాతి కంపెనీల ప్రధాన కార్యనిర్వాహక అధికారుల(సిఇఓ)లతో కూడిన ఆర్థిక వేదిక సమావేశాలు
-
ప్రతి ఏడాదీ జనవరి మూడోవారంలో స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతాయి
-
సాంకే తిక పరిజ్ఞానం, అభివృద్ధి వంటి అనేక ప్రపంచ సమస్యలను చర్చించే ఈ వార్షిక సమావేశాలు 2025
-
అసాధారణ వ్యవహారా లకు ప్రత్యక్ష వేదిక కాబోతున్నాయి
-
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంలో
-
బ్రహ్మాండమైన పురోగతి సాధిస్తున్న ప్రపంచాన్ని రూపుదిద్దడంకోసం అత్యున్నతస్థాయీ నిత్యా చక్రవర్తి
latest breaking news in telugu
సాంకేతికతను ఉపయోగించుకోవడానికి వీలుగా తన ఎజెండాను నిర్దేశించడానికి డోనాల్డ్ ట్రంప్ దృశ్యమాధ్యమ విధానం ద్వారా
ఈ సమావేశంలోని ప్రతినిధులతో విభిన్నమైన భౌగోళిక స్థితిగతులు, పారి శ్రామిక విభాగాలకు చెందిన 3,000 మంది ప్రపంచ నాయకులను ప్రపంచ ఆర్థిక వేదిక -2025 వార్షిక సమావేశాలు జనవరి 20 నుంచి 24వ తేదీ వరకూ ఐదు రోజులపాటు ఒక్కచోటకు చేరుస్తున్నాయి.
ప్రపంచం ఎదు ర్కొంటున్న ఉమ్మడి సవాళ్ళను చర్చించి సుస్థి రమైన పరిష్కారాలు సాధించడంలో ఉత్ప్రేరకా లుగా దోహదపడేందుకు, పరస్పర విశ్వా సాన్ని పెంపొందించుకునేందుకు సంభాష ణలు నడిపించడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం.
పేద దేశాలతోపాటు అభివృద్ధి చెందిన, పైస్థాయికి ఎదుగుతున్న ఆర్థిక వ్యవ స్థలమధ్య పెరుగుతున్న
అసమానతల సవా ళ్ళను ఏవిధంగా ఎదుర్కోవాలన్న విషయా లపై ప్రతి సంవత్సరం
ఈ ప్రపంచ ఆర్థిక వేది కపై వాడీవేడీ చర్చలు జరుగుతూ ఉంటాయి. రాబోయేకాలంలో చేపట్టాల్సిన మౌలిక విధులకు సంబంధించిన నివే దికలను ఈ వేదికద్వారా విడుదల చేస్తారు. ఐనప్పటికీ కూడా ఆచర ణలో మాత్రం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలూ పెద్దగా అమలు జర గడంలేదు.
ప్రపంచం సాంకేతికంగా భారీఎత్తున పురోగతి సాధిస్తున్న ప్పటికీ కూడా ప్రపంచంలో అసమానతలు మాత్రం మరింత ఎక్కు వగా కొనసాగుతున్నాయి.
ఈ సమావేశాల ప్రారంభ దినంనాడే అమెరికా అధ్యక్షుడుగా డోనాల్ ట్రంప్ అమెరికా 48వ అధ్యక్షుడుగా
ప్రమాణ స్వీకారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక –2025 ఈసారి “బుద్ధిజీవుల శకం” అనే అంశాన్ని ఇతివృత్తంగా స్వీకరించింది. అంటే ఈ ఇతివృత్తం మేరకు ‘బుద్ధిజీవులమధ్య సహ కారాన్ని క్రియాశీల పధ్ధతులలో ముందుకు తీసుకువెళ్ళాలి. సంక్లిష్ట మైన ప్రపంచ సమస్యల పరిష్కారాలకుగాను “ధైర్యంగా ఆలోచించి సమష్టిగా నిర్ణయాలు తీసుకుని అందరి సహకారంతో ఉమ్మడి కార్యా చరణ”చేపట్టడమే దీని అంతరార్థం. ప్రపంచవ్యాప్తంగా
అన్నిదేశాల నుండీ వస్తున్న సిఇఓలతో డోనాల్డ్ ట్రంప్ సంభాషణలు జరిపి డబ్ల్యు ఇఎఫ్

తన వైఖరిని వారికి వివరించి ఆధునిక సాంకేతిక తను వాడుకుంటూ, అందుకు అనుగుణంగా లక్ష్యాలు.
సాధించడాని కి ఈ వేదికను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారని
అందరూ అంచనా వేస్తున్నారు. రాబోయే ఆమెరికా ప్రభుత్వ కార్యక లాపాలలో అన్నివిధాలుగా చేదోడువాదోడుగా ఉండే ట్రంప్ శిష్యు డు,
సహాయకుడు, టెస్లా కంపెనీ సిఇఓ ఎలాన్ మస్క్లు ఈ ఏడాది డబ్ల్యుఇఎఫ్ నిర్దేశించుకున్న ఇతివృత్తం ఎంతో ప్రత్యేక ప్రాధాన్యత గలది.
అందరి సహకారంతో ఉమ్మడి కార్యాచరణకు బ్రహ్మాండమైన వ్యూహాన్ని రూపొందించడంలో డోనాల్గంప్కు
ఇప్పుడు ఎలాన్ మస్క్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. “అభివృద్ధి ప్రక్రియలో, పరి శ్రమలరంగంలో
కృత్రిమ మేధస్సు వినియోగం” అనేదే డబ్ల్యుఇఎఫ్
సమావేశం చర్చలలో కీలకమైన అంశం. ఈ విషయంలో ఎలాన్ మస్కు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.
వీలైనంతవరకూ ఈ ఎజెండా ను డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి
టెస్లా సిఇఓ మస్క్ తన ఆలోచనలతో ఈ ప్రతిపాదనపై బ్రహ్మాండ మైన ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
సోషల్ మీడియా-ఆర్థిక కంపెనీలపై పట్టుకోసం ట్రంప్ తాపత్రయం
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సహా ఇతర అత్యున్నతస్థాయీ సాంకేతిక పరిజ్ఞాన కంపెనీలన్నీ
దీర్ఘకాలంగా అమెరికా రాజకీయాల లో డెమోక్రటిక్పార్టీకే అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి.
కానీ పేరాశలు కల్పించి మభ్యపెట్టే డోనాల్డ్ ట్రంప్ సలహాదారుల విధానం కారణంగా పరిస్థితుల్లో చాలా మార్పులు సంభవించాయి.
సోషల్ మీడియా సర్వీస్ “ఫేస్బుక్” సహ-వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్ బెర్గ్ ఇప్పటికే పార్టీ ఫిరాయించారు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో ఫ్యాక్ట్ చెకింగ్ను
ఎత్తివేయడం వంటి చర్యల ద్వారా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందుగానే డోనాల్డ్ ట్రంప్ శిబిరానికి జుకర్ బెర్గ్ లొంగిపోయారు.
ఇక గూగుల్ కూడా ట్రంప్ సలహాదారులు చేస్తున్న తీవ్రమైన ఒత్తిడులమధ్య నలిగిపోతున్నది.
ట్రంప్ ప్రమాణగా చెలామణీ అవుతున్న ప్రముఖులు దావోస్ లో ఐదురోజులపాటు మకాం వేస్తున్నారు.
పౌర సమాజం, సామాజిక రంగం, కార్మిక సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు, మతసంబంధమైన,
దేశీయ జాతు లకు చెందిన ప్రముఖులు, నిపుణులు, ప్రపంచ ప్రముఖ విశ్వవిద్యా లయ అధిపతులు,
పరిశోధనాసంస్థల అధిపతులు, బుద్ధిజీవులు బృందాలు, ప్రపంచ యువ నాయకులు, సామాజిక ఆవిష్కర్తలు,
వివిధ ప్రపంచ సమస్యలకు స్థానికంగా పరిష్కారాలు చూపించే
ప్రముఖులు సమావేశాలకు హాజరవుతున్నారు.
ఆర్థికరంగంలో 2030 నాటికి ఏ విధంగా 17 కోట్ల (170 మిలియన్లు) కొత్త ఉద్యో గాల సృష్టించడానికి

ప్రపంచ ఆర్థిక వేదికకు ట్రంప్ ఎజెండా TELUGU NEWS
గల నూతన సాంకేతిక విజ్ఞానం, ప్రపంచ తీరు తెన్నుల్లో ఏవిధంగా మార్పులు తీసుకురావాలి అనే విషయాలపై సమావేశంలో చర్చిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా కార్మికుల నైపుణ్యాలను పెంపొందించడం, సమీపంలో ఉన్న, రాబోయే దశాబ్దకాలంలో ఎదు రయ్యే అతిపెద్ద సంక్లిష్ట సమస్యలను గుర్తించడం, భవిష్యత్ నివేదిక లు రూపొందించడం వంటి కార్యకలాపాలను ఈ సమావేశం నిర్వ హిస్తుంది.
సైబర్ ప్రపంచంలో భద్రత, పెరుగుతున్న సమస్యలు, దేశా లమధ్య ఉన్న పరస్పర ఆధారిత సరఫరా వ్యవస్థలు, సైబర్ నైపుణ్యం లో ఏర్పడుతున్న శూన్యత వంటి అంశాలతోపాటు కృత్రిమ మేధస్సు,
స్వీకారం చేసిన తర్వాత గూగుల్పై ఈ ఒత్తిళ్ళు మరింత ఉద్ధృతంగా పెరిగిపోయే అవకాశం ఉంది.
యావత్ సోషల్ మీడియా వేదికలు నడిపే కంపెనీలన్నింటితోపాటు కొత్తగా తలెత్తుతున్న
ఇతర ఆర్థిక రంగ సంబంధిత కంపెనీలన్నింటిపైనా కూడా పెత్తనం చెలాయించా లని, వాటి రీమోట్ కంట్రోల్ను ఎలాన్ మస్క్ సహకారంతో తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని డోనాల్డ్ ట్రంప్ బలంగా కోరుకుంటున్నారు.
“ఈ ఏడాది ఆరంభంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు గతకంటే విభిన్నమైన, అద్వితీయమైన సమావేశాలు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను, వ్యాపారాలనునడిపే నిర్ణయాత్మక శక్తులైన యజమానులు,
Also Read
ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు
district paper today
Manmohan కు భారతరత్న| Bharat Ratna to Manmohan
all news paper telugu
పౌర సమాజ నిర్దేశకులు దాదాపుగా 3,000 మంది నాయకులను దావోస్ వేదిక ఒక్కచోటకు చేరుస్తోంది, ఎంతో లోతైన
పరివర్తనకు గురవుతున్న ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ విధాన నిర్దేశకులంతా
దావోస్ వేదిక వద్ద గుమిగూడుతున్నారు” అని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, ట్రస్టీల బోర్డు ఛైర్మన్ క్లాస్ స్క్వాబ్ (87) అన్నారు.
“విభిన్నమైన ఆలోచనలు, విభిన్న ఆర్థిక, భౌగోళిక ప్రాంతాలనుండి వచ్చే నాయకులతోపాటు ఎన్నో
అనిశ్చిత పరిస్థితులు ఈ సమావేశా లలో ఉన్నప్పటికీ, సర్వసమ్మిళితంగా అందరినీ కలుపుకుని వెళుతూ ‘రాబోయే బుద్ధిజీవుల
శకాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దే లక్ష్యం తో సహకారం, నిర్మాణాత్మకమైన ఆశాభావ స్ఫూర్తి
నింపేందుకు 2025 డబ్ల్యుఎఫ్ వార్షిక సమావేశాలు దోహదం చేస్తాయి” అని క్లాస్ స్కాబ్ అన్నారు.
1,600 మంది బిజినెస్ లీడర్లు హాజరు
ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు 1,600 మందికిపైగా బిజి నెస్ లీడర్లు, మరో 900 మంది ప్రపంచ
అగ్రశ్రేణి కంపెనీల చీఫ్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్లు, నవీన ఆవిష్కరణలతో ప్రపంచానికి కొత్త ఊపిరు లు ఊదిన 120మంది ఆవిష్కర్తలు,
సాంకేతికరంగంలో దారిదీపాలు కీలక పరిశ్రమల్లో దానిని చేపట్టాల్సిన అవసరం
కొత్త పరిశోధనల ఆవశ్యకత, ఆచరణాత్మక వ్యూహాలు వంటి విషయాలను చర్చిస్తుంది.
వాతా వరణం, ప్రకృతి, ఇంధనం వంటి విషయాలలో కాప్ సదస్సుల ఫలితాలను పరిశీలిస్తుంది.
2024 లో భూమి, జీవ వైవిధ్యం, పునర్వినియోగ ఇంధన వనరులవ్యాప్తి, ఇంధన డిమాండ్,
ప్రకృతి సంరక్షణ, పునరుద్ధరణ, ప్లాస్టిక్ పై ప్రపంచం తీసుకున్న చర్య ల్లో భాగస్వామ్యం వంటి విషయాలను పరిశీలిస్తుంది.
డబ్ల్యుఇఎఫ్ ఈసారి బంగ్లాదేశ్ హవా!
ఈసారి ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో బంగ్లాదేశ్ ఒక ఆకర్షణ కానున్నది.
అక్కడ జరుగు తున్న పరిణామాలపైన అందరి దృష్టీ కేంద్రీకృత మైం ది.
ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనుస్ కూడా హాజరవుతున్నారు. ప్రపంచ నాయకులు బంగ్లాదేశైపై ఇప్పుడు ఆసక్తి చూపిస్తు న్నారు. యూనుస్ హయాంలో జరుగుతున్న పరి ణామాల ను, భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను ప్రపంచదే శాలు గమనిస్తున్నాయి.
మహ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వహ యాంలో బంగ్లాదేశ్కు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రచారం లభించింది
ప్రపంచ ఆర్థిక వేదికకు ట్రంప్ ఎజెండా TELUGU NEWS
తద్వారా ఈ సమావేశాలలో బంగ్లాదేశ్ లాభపడే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సమావేశాలలో భార త్పై బంగ్లాదేశ్ ఎలాంటి ఆరోపణలు చేసినాగానీ తిప్పికొట్టేందుకు,
దీటైన సమాధా నం చెప్పేందుకు భారత ప్రతినిధిబృందం సంసిద్ధ మైంది. తగినరీతిలో అప్రమత్తంగా ఉంది.
భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సదస్సుకు వెళ్ళడంలేదు.
ఆయన తరపున కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ సారథ్యం లో ఒక ప్రతినిధి బృందం ఈ ఐదురోజుల సమావేశాల్లో పాల్గొంటు న్నది. సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటున్నారు. మనదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
వీరంతా పెట్టుబడులకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటారు.
కృత్రిమ మేధస్సు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్థిరమైన పెట్టుబడుల సాధనకుగల అవకాశాలు, సవాళ్ళు వంటి విషయాలపై సదస్సులలో భారత్ ప్రతినిధులు పాల్గొంటారు. భారతదేశం నుండి 65 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు
ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అనేక భారతీయ కంపెనీలు దావోస్లో తమ శాలలు ఏర్పాటు చేశా యి.
భారతదేశం చక్కటి ఆర్థికవృద్ధిని సాధిస్తూ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంటోందని దోహాలో భారత వర్గాలు చెప్పాయి.
2000 సంవత్సరం నుండీ భారతదేశం ఒక ట్రిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మైలురాయిని దాటి ముందుకు ప్రయాణించింది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలోనే 42.1 బిలియన్ డాలర్ల ఎఫ్ఐని భారత్ రాబట్టిందని భారత్ తెలిపింది.
More News Join Telegram Channel