ఇటు తెలంగానం – అటు పలాయనం
News Today In Telugu Telangana
- జయ జయ హే’ గీత రచ యిత అందె శ్రీ వంటి వారందరినీ ‘ప్రగతి భవన్’
-
ఈ సంవత్సర కాలంగా ‘ప్రజాపాలన’, ‘ప్రజాప్రభుత్వం’ అనే మాటలు జనంలో
-
కెసిఆర్ హయాంలో విద్య, వైద్య రంగాలు కాదు, అన్ని రంగాల ను నిర్వీర్యం చేశారు
తెలంగాణ రాజకీయాలు రివర్స్ లో నడుస్తున్నవి. ‘తెలంగాణ వాదం’ పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ‘పలాయన వాదా న్ని’ ఆశ్రయించింది. అయినదానికీ, కానిదానికీ _ముఖ్యమంత్రి రేవంత్ ను టార్గెట్ చేసుకొని కెటిఆర్, హరీశ్ రావు చెలరేగిపోతున్న విషయం తెలంగాణ సమాజం గమనిస్తోంది. రేవంత్ రెడ్డి పరిభాషలో చెప్పాలంటే ‘గాలి బ్యాచ్’ వీధుల్లో ‘వీరంగం’ చేస్తున్న సంగతి తెలిసిందే! ‘తెలం గాణ పునర్నిర్మాణం’ కోసం తమ ‘ప్రజాప్రభుత్వం’ కట్టుబడి ఉందని, అందుకోసం నిబద్ధతతో పనిచేస్తోందని తెలంగాణ తల్లి విగ్ర హావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు.
ఎస్. జకీర్ కెసిఆర్ కోల్పోయిన ‘తెలంగాణ వాదం’ నాడిని రేవంత్ రెడ్డి సునాయాసంగా ఒడిసి పట్టుకున్నారు. ఆయన ఆ ‘వాదం’ చుట్టే పరి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం లో సర్వస్వము కోల్పోయిన కవులు, రచయితలు, గాయ కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తిస్తోంది. వారికి కోటి రూపాయల నగదు, 300 గజాల భూమితో గౌరవించబో తున్నారు. తనతోనే తెలంగాణ వచ్చిందన్న భావన తనలో బలంగా పాతుకుపోయినందున ఇక మరెవరినీ తెలం గాణ ఉద్యమ కారులుగా, ఉద్యమంలో భాగస్వాము లుగా కెసిఆర్ గుర్తించలేదన్న విమర్శలున్నవి.
జయ జయ హే’ గీత రచ యిత అందె శ్రీ వంటి వారందరినీ ‘ప్రగతి భవన్’
‘తెలంగాణ’ అంటే ఏమిటి? ఒక రాష్ట్రమా? ఆరని భావోద్వేగపు జ్వాలా?1200 మంది యువకుల రుధిర సంతకమా? ‘చావు నోట్లోకి పోయి వచ్చిన’ మనిషి పేటెంటా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత కూడా దీనిపై చర్చ జరుగుతోంది. “తెలంగాణ అంటే బహుజన వాదం. తెలంగాణ అంటే సకల జనహితం. ఈ వాదాన్ని ఓడిపోనివ్వం. ఈ జనహితాన్ని కరిగిపోనివ్వం. కమ్యూనిస్టుల అండతో మతతత్వ శక్తులను తరు ముదాం”. అని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పోస్టును X
లో పెట్టారు.
ఈ సంవత్సర కాలంగా ‘ప్రజాపాలన’, ‘ప్రజాప్రభుత్వం’ అనే మాటలు జనంలో
వాధులమని, తమకే దీనిపై పేటెంటు హక్కులున్నాయని భావించిన కెసిఆర్, కెటిఆర్లకు రేవంత్ దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తున్నారు.
“చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి తెలంగాణ వాదా ? నోట్లకట్టలతో అడ్డంగా దొరికిన వ్యక్తి తెలంగాణ వాదా? ఎవరు తెలంగాణ వాది’? అంటూ కెసిఆర్ ‘భక్త బృందాలు’ వాదిస్తూనే ఉన్నాయి. ఈ ‘భక్త బృందాలు’ అయినా, ఆ బృందాలకు ‘రాజపోషకులైన బిఆర్ఎస్ కీలక నాయకులు కానీ కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసి ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ రాష్ట్రం ఏర్పడితే దాని సంక్షిప్త నామం ‘టి.జీ’ గా ప్రజలూ, ఉద్యమకారులూ డిసైడ్ చేసుకొని, వాహనాలపై స్టిక్కర్లు అంటించుకుని తిరిగారు. తెలంగాణ ఆవిర్భవించగానే మొత్తం రాష్ట్రాన్ని కెసిఆర్ తన ఆధీనంలోకి తీసుకు న్నారు. ప్రజలు, ఉద్యమకారుల ఆకాంక్షలంటే ‘కెసిఆర్ ఆకాంక్ష’ అని అర్ధం. కెసిఆర్ ఆకాంక్షే తెలంగాణ ఆకాంక్ష అని అర్ధం చేసుకో వాలి.
‘రాజ్యం’. తెలంగాణ అనేది ఒక ‘రాజ్యం’. ఆ రాజ్యానికి అధి పతి కెసిఆర్
తెలంగాణ జీవితం,తెలంగాణ గోస, తెలంగాణ బాధలు, తెలం
గాణ గాథలు తెలిసిన, తెలంగాణను కలగని, సాధించిన ఏకైక వ్యక్తి మహానాయకుడు కెసిఆర్ మాత్రమేనని ఆయన ‘భజన మండలి’ చెబుతూ వస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ‘కాంట్రిబ్యూషన్’ గురించి కెసిఆర్ ‘భక్త జనం’ ఎన్నడూ ప్రస్తావించరు. అలా ప్రస్తావిస్తే ‘బాపు’కు నచ్చదని వాళ్లకు తెలుసు. ఆయనకు ఆగ్రహం వస్తుందనీ తెలుసు. అందువల్ల కెసిఆర్, ఆ తర్వాత కెటిఆర్ మనసెరిగి మసలు కోవడమే ప్రయోజనమని గట్టిగా నమ్ముతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకే పట్టం గట్టి, ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తారని ఊహించిన వారంతా ఫలితా లు చూసి ఖంగుతిన్నారు. అందుకే ‘కెసిఆర్ ఉప్పు తిని కెసిఆర్కి ద్రోహం తలపెడతారా’? అనే ధోరణిలో ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
breaking news in telugu telangana
రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యలు
to newspaper telugu
తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని రాజకీయ మార్పు తో బిఆర్ఎస్ కాళ్ళ కింద నేల కదిలిపోయింది
కాగా తెలంగాణ ప్రజలకు అత్యవసరమైన విద్య, వైద్య రంగాల ను కెసిఆర్ ఎంతగా నిర్లక్ష్యం చేశారో. కాంగ్రెస్ మంత్రులు తరచూ వివరాలు చెబుతూనే ఉన్నారు. తెలంగాణలోని ఏ విశ్వవిద్యాలయం గురించి ఇప్పుడు గర్వం గా చెప్పుకునే పరిస్థితి లేదు. విద్యను నిర్లక్ష్యం చేయటం కూడా బిఆర్ఎస్ ఓటమికి ఒక ప్రధాన కారణం” అని పౌరహక్కుల ఉద్యమ నాయకుడు, ప్రొఫెసర్ జి.హరగోపాల్ విశ్లేషించారు. రేవంత్ ప్రభుత్వం విద్య, వైద్యం విషయంలో ఒకడుగు ముందుకు వేసి విద్యా కమిషన్, రైతు కమిషన్ ఏర్పాటు చేశారు.
కెసిఆర్ హయాంలో విద్య, వైద్య రంగాలు కాదు, అన్ని రంగాల ను నిర్వీర్యం చేశారు
తాను, తన కుటుంబం, తమ పార్టీ ప్రయోజనాలే ‘తెలంగాణ ప్రయోజనాలు”గా ప్రజల్ని నమ్మించడంలో కెసిఆర్ సక్సెస్ అయ్యారు. ‘రైతు భరోస్తా’ వంటి పథకం అమలును ఆర్ధిక వనరుల పరిమితి మూలంగా రేవంత్ ప్రభుత్వం జాప్యం చేస్తుండడాన్ని భూమ్యాకాశాలను ఏకం చేసి బిఆర్ఎస్ నాయకులు ‘విష ప్రచారం’ సాగిస్తున్నారు. అలాగే ఇక ‘రేపో మాపో కెసిఆర్ మరలా సిఎం అవు తారు’ అంటూ ఇంకో కట్టుకథను ప్రచారంలో పెట్టారు. ఈ ప్రచారం వలలో పడుతున్న సామాన్య జనం లేకపోలేదు. వారందరి దృష్టిలో రేవంత్ రెడ్డి ‘సిఎంగా ఘోరంగా విఫలమయ్యారని, కెసిఆర్ వస్తేనే తెలంగాణ మళ్ళీ గాడిలో పడుతుందని బిఆర్ఎస్ ‘సుపారీ మీడియా’ లో విస్తృతంగా కథనాలను ప్రసారం చేస్తున్నారు.