తెలంగాణ తల్లి’ పరిణామక్రమం రాజధాని సందడి
-
ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు “సందర్భంగా డిసెంబర్ 9 న రాష్ట్ర పరిపాలనా కేంద్రం
-
డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి 20 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
-
ప్రతి ఏటా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తా మని
-
బిఆర్ఎస్ మినహా దాదా పు రాజకీయ పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును స్వా గతించాయి
-
బిజెపి సైతం చిన్నచిన్న అభ్యంతరాలుమినహా తప్పుబట్టలేదు
బిఆర్ఎస్ మాత్రం ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి, భావోద్వేగ అంశంగా మార్చాలనే ప్ర యత్నం చేసినప్పటికీ, సఫలం కాలేదు.
ఇప్పటికే ఉన్న తెలం గాజు తల్లి విగ్రహాన్ని మారుస్తూ కొత్త విగ్రహం పెట్టడమేమి టని ఆపార్టీ ప్రశ్నిస్తోంది.
ఎవరైనా భార్యను మార్చినోడు ఉన్నడు తప్ప తల్లిని మార్చారా? అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కె.టి.రామారావు చేసిన వ్యాఖ్యల క్లిపింగ్ సోషల్ మీ డియాలో వైరల్ గా మారింది.
దీంతో తెలంగాణ తల్లి విగ్రహం చర్చనీయాంశమైంది. బిఆర్ఎస్ కార్యాలయంలో తెలం గాజు భవన్లో ఉన్నదే తెలంగాణ తల్లి విగ్రహమా? అనే చర్చ కు కూడా తెరలేచింది. అనేక మంది లోతుల్లోకి వెళ్ళారు.
బిజెపితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ సినీ నటి విజయశాంతి
గతం నుంచి వర్తమానం వరకు పరిశీలిస్తే, తెలంగాణ తల్లికి సంబంధించి నాలుగు విగ్రహాలు ఉన్నాయి.
అందరు కూడా ఉద్యమకాలంలో టిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పా టైన తెలంగాణ తల్లి విగ్రహమే మొదటిదని భావిస్తున్నారు. కా నీ, అంతకంటే ముందే ఇంకో ఆకృతిలో తెలంగాణ తల్లి విగ్ర హం ఉంది. బిజెపితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ సినీ నటి విజయశాంతి తెలంగాణ విషయంలో ఆ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో గుడ్బై చెప్పారు. ఆ తరువాత ఆమె సొం తంగా తల్లి తెలంగాణ పేరుతో 2005 జనవరి మాసంలోపార్టీ పెట్టి తెలంగాణ కోసం ఉద్యమానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. మొట్టమొదటి సారిగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరింపబడి ంది.
ఆమె చేతుల మీదుగానే.ఉ మ్మడి నల్లగొండ జిల్లా రాజపేట మండలం బేగంపేటలో సూదగాని వెంకటేశ్ అనే ఉద్యమకారుడి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటైంది. ఆవిగ్రహాన్ని 2007జనవరి 25న విజయశాంతి ఆవిష్కరించారు.
ఆ విగ్రహానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి దగ్గరి పోలికలు ఉన్నాయని శాసనమండలిలో చర్చ సందర్భంగా పట్టభద్రుల ఎంఎల్ సి మల్లన్న కూడా చెప్పారు. ఇక బిఆర్ఎస్ నేతలు చెబుతున్న తెలంగాణ తల్లి విగ్రహం మొదటి కా దు.
రెండవది. ఈ విగ్ర హానికి నిర్మల్కు చెందిన బి.వి.ఆర్. చారి రూపకల్పన చేశారు.
తలపై కిరీటంతో ఉండే ఈ విగ్రహాన్ని తొలిసారిగా తెలంగాణ భవన్లో 2007 నవంబర్ 16న టీఆర్ఎస్ అధ్య క్షుడు కె.చంద్రశేఖర్రావు ఆవిష్కరించారు.
ఇక మూడవ విగ్రహం, 2022 సెప్టెంబర్ 17న గాం ధీ భవన్లో ఆవిష్కరిం చారు నాటి టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి. ఈ విగ్రహం కాంగ్రెస్ జెండా రంగులతో పోలిన మూడు రం
ఉంటుంది. తెలంగాణ తల్లి ఒక చేతిలో కట్టి ఉంటుంది. ఇక నాలుగవ విగ్రహం, తాజాగా డిసెంబర్ 9న అసెంబ్లీలో ప్రకటన, దానిపై సకల పార్టీల చర్చ, తరువాత జివా ద్వారా అధికార ముద్రతో సచివాలయంలో ఏర్పాటైంది.
తాను ఉద్యమకారులతో చర్చించి నిర్ణయం తీసుకు న్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు
నాలుగు విగ్రహాలలో, తెలంగాణ భవన్లో ఏర్పాటైన విగ్రహం మినహా మూడు దాదాపు దగ్గరగా ఉంటాయి.
ఆ విగ్రహాలకు కిరీటం ఉండదు. చేతిలో తెలంగాణలో పండే వరి, కండి, సజ్జ పంటలు పట్టుకుని ఉంటుంది.
బేగంపేట విగ్రహంలో అది కుడి చేతిలో ఉంటే, మిగతా రెండు విగ్రహాలలో ఎడమ చేతిలో ఉంటాయి.
ఈ మూడు కూడా సామాన్య తెలంగాణ మాతృమూర్తి ప్రతిరూపానికి దగ్గరగా ఉన్నాయి. ఉద్యమకాలం నాటి విగ్రహం కుడి చేతిలో మక్క, సజ్జకంకులు, ఎడమ చేతిలో బతుకమ్మ, తలపై కిరీటం ఉంటుంది.
ఈ విగ్రహంపై కెసిఆర్ స్వంతంగా నిర్ణయం తీసుకున్నారని నాటి తెలంగాణ జెఎసి, నేటి ఎంఎల్సి కోదండరామ్ అన్నారు.
తాను ఉద్యమకారులతో చర్చించి నిర్ణయం తీసుకు న్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ప్రయోజనం ఎవరికి?
కేవలం బిఆర్ఎస్ శ్రేణులకే అది పరిమితమైంది
మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సంద ర్భంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పరస్పర ఆరోపణల యుద్ధమే జరిగింది.
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అని, దానిని తిరిగి గాంధీభవన్కు పంపిస్తామని బిఆర్ఎస్ నేతలు అన్నారు.
బిఆర్ఎస్ ఎందుకంత తీవ్రస్థా యిలో స్పందించిందనే ప్రశ్నలు తలెత్తాయి.
కిరీటంతో ఉండే తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణలో ఏర్పాటు చేసుకు న్నారు.
2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన, తరువాత పరిణామాలతో ఇలాంటి నమూనాలో ఉండే విగ్ర హాలే తెలంగాణలో చాలా చోట్ల ఏర్పా టయ్యాయి.
తెలంగాణ ప్రక్రియ వెనక్కిపోవడంతో నాడు ప్ర జలంతా జెఎసి ఆధ్వర్యంలో ఒక్కటి.
అప్పటికే ఉద్యమ పార్టీగా ఉన్న టీక ర్ఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన విగ్రహాన్నే ఆవిష్కరించుకున్నారు.
ఆ విగ్రహాన్ని మార్చితే ఉద్యమంతో త మ బంధం తగ్గుతుందేమోనని బిజ ర్ఎస్ భావించింది.
అందుకే ఆ అం శాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తినా ఆ పా ర్టీ ఆశించిన స్థాయిలో ప్రజామద్దతు రాలేదు.
కేవలం బిఆర్ఎస్ శ్రేణులకే అది పరిమితమైంది. ఎందుకంటే అధికారికంగా
కొత్తగా సచివాలయంలో తెలంగాణతల్లి ఏర్పా టుద్వారా తెలంగాణ సమాజానికి కొత్త విషయాలు తెలిసా యి. పాత విగ్రహమే అధికారకమైందనే భావనలో చాలా మ ంది ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థాపిం చిన తెలంగాణ తల్లి విగ్రహమే అధికారయుతమైనదని తేలిం ది.
అంతేకాకుండా పదేళ్ళ ఉ ద్యమ పార్టీ ప్రభుత్వంలో నాటి తెలంగాణ తల్లికి అధికారిక ముద్ర పడలేదని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
“జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ పాటకు అధికారిక రాష్ట్ర గేయం
అలాగే చర్చల సందర్భంగా అప్పటిదే తొలి తెలంగాణ విగ్రహం కాదని, బేగంపేటలో ఏర్పాటు చేసింది.
తొలి విగ్రహమనే విషయం కూడాచాలా మందికి అప్పుడే ఏ రుకలోకి వచ్చింది. దీంతో బిఆర్ఎస్ వాదనకు బలం చేకూర లేదు.
ఇక ఉద్యమ కాలంలో అందరి ఏకాభిప్రాయాన్ని పొం దిన అందెశ్రీ విరచిత “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ పాటకు అధికారిక రాష్ట్ర గేయం ప్రతిపత్తి గత ప్రభు త్వ పాలనలో ప్రకటించలేదు.
ఒక విధంగా డిసెంబర్ 9న అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం
ఏర్పాటు చేయడం, ప్రతిఏటా ఆ రోజున తెలంగాణ తల్లి ఆవరణ దినోత్సవాలు చేస్తామని ప్రకటించడం వ్యూహాత్మకమే. తెలంగాణ ఏర్పాటు ఘనతను తిరిగి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం. డిసెం బర్ 9వ తేదీకి తెలంగాణలో ఒక ప్రాముఖ్యత ఉన్నది.
2009డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తరుపున హోంమంత్రి చిదం బరు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చారి తాత్మ ప్రకటన చేశారు.
ఆ తరువాత అనేక ఆటంకాలు ఏర్ప డినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆ ప్రకటనే ఊతం.
తెలంగాణ సృప్నాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం డిసెంబర్ 9నే, తెలంగాణ వచ్చాక ప దేళ్ళు పాటు టిఆర్ఎస్/ బిఆర్ఎస్ రాష్ట్ర ఏర్పాటు ఘనతను తమ ఖాతా లోనే వేసుకుంది.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలు కాంగ్రెస్ పార్టీకి ఒక వేదిక కానుంది
news paper today
ఆ ఖ్యాతిలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర అని చెప్పేందుకు, అందులో సోనియాగాంధీ ప్రాధాన్యతను కూడా గుర్తు చేసుకునేందుకు ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలు కాంగ్రెస్ పార్టీకి ఒక వేదిక కానుంది. సచివాలయంలో విగ్రహావిష్కరణ రోజునే
తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులు, రచయితలు, కవులను గుర్తిస్తూ, వాటిని తామ్ర పత్రం, 300 గజాలస్థలం,
కోటి రూపాయల న గదుతో సత్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం కూ దా ప్రశంసలు అందుకున్నది.
ఎందుకంటే ప్రభుత్వం గుర్తిం చినట్లు ప్రకటించిన గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందిక్రీ, గోరేటి వెంకన్న.
సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాశంయాదగిరి, ఎక్కాయాదగిరిరావులకు టిఆర్ఎస్ ఒకింత ప్రధాన పాత్ర పోషించిన మలి దశ ఉద్యమంలోనే కాకుండా అంతకుముందు నిర్బంధాలలో ఉద్యమానికి భూమిక వేసేం దుకు జరిగిన కృషిలో విశేష పాత్ర పోషించారు.
తెలంగాణ అంటే కేవలం గత ప్రభుత్వ గుర్తించిన ఉద్యమకారులే కాదని, వెలుపల ఉన్న వారు కూడా ఉన్నారనే సంకేతాలను
సమాజా నికి ఇవ్వాలనే కాంగ్రెస్ లక్ష్యం నెరవేరింది. తెలంగాణ ఉద్య మం ఏ కొందరి సొంతమో కాదనే సందేశాన్ని జనంలోకి సుకెళ్ళగలిగింది.
ప్రజాపాలన వారోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూలత ఒనగూరింది.
స్థూలంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బేగంపేటలో తొలిసారిగా స్థాపించిన
తెలంగాణ తల్లి విగ్రహంతో ఇటీవల ప్రభుత్వరం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి అధికార విగ్రహానికి సమీప పోలికలు ఉన్నాయి.