నిర్మలమ్మది సంపన్నుల బడ్జెట్
ఉపాధి, వ్యవసాయ రంగాల పట్ల ఉదాసీనత సిపిఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు
నిర్మలమ్మది సంపన్నుల బడ్జెట్|TELUGU NEWS కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవే శపెట్టిన 2025–26 కేంద్ర బడ్జెట్ సంపన్నుల బడ్జెట్ అని నిర్మలా సీతారా మన్ మరోసారి ధనిక,
కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాశారని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు.
అంకెల గారడీ చేసిం దని ఆయన తెలిపారు. కేంద్ర బడ్జెట్పై స్పందిస్తూ శనివారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశంలో నిరుద్యోగం పెరిగి ఉపాధి లేక యువత దేశానికి భారమవుతున్న దశలో ఉపాధి రంగాలను పూర్తిగా విస్మరించారని ఆయన తెలిపారు.
ఒక రాష్ట్రంగా పరిగణించకుండా కక్ష సాధింపు ధోరణిని అవలంభించారని ఇది కేవలం బిజెపి రాజకీయ అవసరాలు,
మోడీ అనియ యుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని హేమంతరావు తెలిపారు.
బడ్జెట్ అంకెల గారడి మాదిరిగానే ఉంది
కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకేనా అని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ విమర్శించారు.
పార్ల మెంట్లో శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఆంధ్రప్ర దేశ్, బీహార్ రాష్ట్రాలకే కేటాయించబడ్డదని తెలంగాణకు బిజెపి మొండి చేయి చూయించిందని,
గతంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీల
అమలుకై నిధులు కేటాయిస్తామని తెలంగాణకు ఎలాంటి నిధులు కేటా యించకపోవడం ముందే ఊహించిందేనన్నారు.
ఈ బడ్జెట్ అంకెల గారడి మాదిరిగానే ఉందని పేద, మధ్యతర ప్రజలకు ఈ బడ్జెట్తో ఒరిగిందేమి లేద న్నారు.
రాజకీయ ఎన్నికల బడ్జెట్..పేదలకు నిరాశ.. తెలంగాణకు మొండిచేయి
ప్రతినిధి కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సామాన్యులను, కష్టజీవులను పట్టిం చుకోలేదు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పట్టించుకోలేదు, గద్వాల్ జిల్లా రైల్వే ప్రాజెక్టులకు నిధులివ్వలేదు వ్యాపారులకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ,
దేశ సమ్మిళిత అభివృద్ధి బడ్జెట్ కాదు సీతారామన్ బిజెపి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే ఈ బడ్జెట్ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు రాజకీయా అవసరాలు ఉన్న ప్రాంతాలు అధిక ప్రాధాన్యత ఇచ్చారని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు అన్నారు.
తెలంగాణకు గద్వాల జిల్లాకు మొండిచేయి చూపడం ఇక్కడ బిజెపి ఎంపీలు సమాధానం చెప్పాలి.
కార్పొరేట్లకే అనుకూలమైన బడ్జెట్
కార్పొరేట్లకే అనుకూలమైన బడ్జెట్ సిపిఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్ కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్పొరేట్ శక్తులకే అనుకూలమైనదిగా ఉందని సిపిఐ మహబూబ్ నగర్ జిల్లా శాఖ కార్యదర్శి బృంగి అంకెల గారడీ తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేద ని,
ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు ఇన్కమ్ టాక్స్లో 7 లక్షల నుండి 12 లక్షల వరకు పెంచడం కొంత సంతోషదాయకమైనదని ఆయన తెలి పారు.
మరీ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభు త్వం జాతీయ హోదా కల్పిస్తూ నిధులు కేటాయిస్తుందన్నాం కానీ బడ్జెట్లో పాలమూరు ఊసే లేకపోవడం విడ్డూరమన్నారు. జిల్లాకు ఎలాంటి బడ్జెట్ లేకపోవడం శోచనీయమని,
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడి తప్ప, సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
Also Read
31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
NEWSLOCAL NEWSNEWSPOLITICAL
మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan
international news in telugu
తొక్కిసలాట అల్లుకు తెలుసు | Latest News Telugu
Telugu Latest Updates
బడ్జెట్ రూపకల్పనలో వారిదే బాధ్యత| Telugu News
ప్రైవేటీకరణకు ఊతమిచ్చిన బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రైవేటీకరణకు ఊతమిస్తుందని సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. శని వారం బడ్జెట్పై సిపిఐ జిల్లా సమితి పక్షాన ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూటికి నూరు శాతం బీమా సహా పలు రంగాల్లో ఎఫ్ డిఐలను ఆహ్వానించడమంటే ప్రైవేటీకరణకు నూటికి నూరు శాతం సహకరించినట్లేనని ఆయన తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంపన్న వర్గాలకే కొమ్ము కాస్తున్నారని, సంపన్నులను మరింత సంపన్నులుగా మార్చే బడ్జెట్ను ప్రవేశపెట్టారని శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సైతం అదే రీతిలో ఉందని ఆయన తెలిపారు.
పంటల మద్దతు ధరను, రైతుల వ్యవసాయాన్ని విస్మరించిన కేంద్ర బడ్జెట్

రైతులను దేశీయ వ్యవసాయాన్ని దివాలా తీయిం చి కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కుట్రలో భాగంగానే
పంటల మద్దతు ధర చట్టం, ఉత్పత్తి ఖర్చుల తగ్గింపు ప్రస్తావన లేకుండానే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆందోళనకరమని అఖిల
భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. కేంద్రం లోని మోడీ ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నా
మని గొప్పలు చెప్పుకుంటు ఆరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకమన్నట్లు
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించి దోచుకునే విధంగా బడ్జెట్ రూపకల్పన
చేస్తు న్నారని దేశానికి వెన్నెముక అయిన దేశీయ వ్యవసాయ రంగాన్ని ప్రోత్స హించకుండా
రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర చట్టం ప్రక టించకుండా పంటల ఉత్పత్తి ఖర్చులను
తగ్గించకుండా వ్యవసాయ పారిశ్రా మిక అభివృద్ధిని చేపట్టకుండా దేశఅభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.
కరీంనగర్కు నిధులు కేటాయించలేని కేంద్ర మంత్రి ‘బండి’

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజానీకాన్ని నిరాశపరి చిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి విమర్శించారు. అంకెల గారడీతో రంకెలు చూపించి ఆశల పల్లకిలో ఊరేగించి బడ్జెట్ పెంచి చూపిం చినప్పటికీ లక్షల కోట్ల వడ్డీ చెల్లింపులకు చూపడం దిగజారిన దేశ ఆర్థిక పరి స్థితికి నిదర్శనమన్నారు. ఆదాయ పన్నులు 12 లక్షల వరకు మినహాయింపు అంటూ మధ్యతరగతి ప్రజలు,
వేతన జీవులను మభ్యపెట్టడానికేనన్నారు. రూ.4 లక్షలు ఆదాయం దాటితే ఐదు శాతం వసూలు చేస్తున్నారని పేర్కొ న్నారు. కష్టజీవులకు ఈ బడ్జెట్తో ఒరిగిందేమీ లేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై జిఎస్టీ విధించకుండా కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోందన్నారు.
వ్యవసాయం, విద్య, వైద్యానికి అధిక నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
పారిశ్రామికవేత్తలకు, సంపన్నులు, కార్పోరేట్లకు అనుకూలంగా కేంద్రం ఉందని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ దేశ ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు.
కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించుకోలేక పోవడంలో
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పూర్తిగా విఫలం చెందా రని, కోట్ల రూపాయలు నిధులు ఆశించిన జిల్లా ప్రజలకు బడ్జెట్ ఆశాభంగం కలిగించిందని పేర్కొన్నారు.